మంచు ఫ్యామిలీ వార్: మనోజ్, ఆయన భార్య మౌనికను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు

హైదరాబాద్: మంచు కుటుంబంలో నెలకొన్న గొడవల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎక్కడ గొడవలు మొదలయ్యాయో.. ఆ గొడవలకు ఏ ఇల్లు అయితే కేంద్రంగా ఉందో.. ఆ ఇంటి నుంచి మనోజ్ను, ఆయన భార్యను మోహన్ బాబు పంపించేశారు. మనోజ్ను, మౌనికను మోహన్ బాబు ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్కు మనోజ్ దంపతులు వెళ్లబోతున్నారు.

Also Read:-దుబాయ్ నుంచి వచ్చిన విష్ణు: మోహన్ బాబు ఇంటికి పోలీసులు.. పెదరాయుడి స్టేట్మెంట్ ఇది..!

ఈ సందర్భంలో మంచు మనోజ్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం, ఆస్తి కోసం పోరాటం చేయటం లేదని, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని మనోజ్ మీడియా ఎదుట చెప్పాడు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నార మనోజ్ మండిపడ్డాడు. న్యాయం కోసం అందరిని కలుస్తానని, తన భార్యాపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే ఈ పోరాటం అని మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.