దివ్యాంగుల జీవితాల్లో వెలుగు రేఖ అఫ్జల్

దివ్యాంగుల జీవితాల్లో వెలుగు రేఖ అఫ్జల్
  • డిఫరెంట్లీ ఏబుల్డ్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌

బషీర్​బాగ్, వెలుగు: దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా బైకులు, కార్లను ఆల్ట్ రేషన్ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అఫ్జల్ అలీ అని తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు షేక్ హబీబ్ మియా అన్నారు. 

అసోషియేషన్ గౌరవాధ్యక్షుడు ముక్కు నర్సయ్య అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం అఫ్జల్ అలీ సంస్మరణ సభను నిర్వహించారు. దివ్యాంగుల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమావేశంలో ఆయన సతీమణి సయ్యద్ ముజఫర్ సుల్తానా, కొడుకు వాజిద్ అలీ, కూమార్తెలు సానియా అఫ్జల్, సనా అఫ్జల్, సోదరులు పాల్గొన్నారు.