వరంగల్ : ఇవాళ్టి నుంచి వరంగల్ పరిధిలో కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ జిల్లాకు 200 టీకా డోసులు, హన్మకొండ జిల్లాకు 1000 టీకా డోసులను వైద్యాధికారులు తెప్పించారు. వరంగల్ కు చేరిన వ్యాక్సిన్ డోసుల్లో కొవిషీల్డ్ టీకాలు ఉన్నాయి. ఈ రోజు నుంచే జిల్లాల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.గత రెండు నెలలుగా కొవిడ్ టీకా తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. గత కొన్ని వారాలుగా ఒమైక్రాన్ ‘బీఎఫ్ -7’ సబ్ వేరియంట్ విజృంభిస్తుండటంతో వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు ప్రజలు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు.