విజయవాడలో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో నగరంలోని 42 డివిజన్లలో పూర్తి లాక్ డౌన్ విధించారు. ఆ ప్రాంతాలలో ఏ విధమైన వ్యాపారాలకు అధికారులు అనుమతులు ఇవ్వడంలేదు. నగర శివారు ప్రాంతమైన జక్కంపూడి వైయస్సార్ కాలనీలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయినా కూడా ఈ ప్రాంతంపై అధికారులు, పోలీసులు దృష్టి సారించలేదు. స్థానిక శ్రీనివాస్ జనరల్ స్టోర్స్ యజమాని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు కరోనా టెస్టులు చేశారు. ఒకవేళ యజమానికి కరోనా పాజిటివ్ వస్తే మరిన్ని కేసులు పెరిగే అవకాశముంది. కార్మికులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని అశ్రద్ధ చేస్తే ముంబైలోని మరో ధారవిగా మారే ప్రమాదముంది. అందువల్ల ఈ కాలనీపై అధికారులు మరింత శ్రద్ధ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
For More News..