- కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్ మధ్య పోటీ
- 2014 నుంచి చైర్మన్ పీఠం కోసం బుర్రి ఫైటింగ్
- మళ్లీ 2018లో చైర్మన్ పదవి కోసం పోటీ పడ్డ బుర్రి, అబ్బగోని
- సిట్టింగ్ చైర్మన్ సైదిరెడ్డి మీద అవిశ్వాసం పెట్టింది మళ్లీ వాళ్లే
నల్గొండ, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీ పై లీడర్ల ఫోకస్ పెరుగుతోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రస్తుత పాలకవర్గాల పైన అవిశ్వాస తీర్మానాలు ఊపందుకున్నాయి. సిట్టింగ్ చైర్మన్లను గద్దె దింపితే ఆ స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్ల గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
మంత్రి ఇలాకాలో పదువులు ఎవరికో
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇలాకా నల్లగొండలో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్‌లో ఇద్దరు సీనియర్లు పోటీ పడుతున్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎ స్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడైన బుర్రి శ్రీనివాస్ రెడ్డికే మొదటి ప్రాధాన్యం ఉంటదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన రమేశ్‌గౌడ్ చైర్మన్ ఇస్తామన్న హామీ మేరకే పార్టీలోకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
కుర్చీ కోసం వెయిటింగ్....
2014లో నల్గొండ మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు కాగా .. ఓసీ లకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ పదవి కోసం పోటీపడ్డారు. కానీ మంత్రి కో మటిరెడ్డి గుమ్మలకు అవకాశం ఇచ్చారు.
అయితే ఆ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసిన మోహన్ రెడ్డి భార్య ఓడిపోయింది. దీంతో చైర్మన్ ఛాన్స్ బీ సీలకు దక్కింది. అప్పుడు అబ్బగోని రమేశ్ గౌడ్ భార్యను చైర్పర్సన్ చేయాలని అనుకున్నారు. అయితే అప్పటికే రెండు టర్మ్‌లు గౌడ సామాజిక వ ర్గానికి అవకాశం ఇవ్వడంతో రమేశ్ భార్యకు మిస్ అయ్యింది. దీంతో బొ డ్డుపల్లి లక్ష్మీని చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. ఈ రకంగా శ్రీనివాస్ రెడ్డి, రమేశ్‌గౌడ్ ఫ్యామిలీకి చైర్మన్ అయ్యే అదృష్టం తొలి ప్రయత్నంలోనే చేజారగా.. వైస్ చైర్మన్ పదవితో శ్రీనివాస్ రెడ్డి సంతృప్తి పడ్డారు.
ఇద్దరూ మళ్లీ ఒకేపార్టీలో...
శ్రీనివాస్ రెడ్డి, రమేశ్‌గౌడ్ కలిసి ప్రస్తుత పాలకవర్గం మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలని కలెక్టర్‌కు తీర్మానం అందజేశారు. కాంగ్రెస్ ఫ్లో ర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డికాగా.. వైస్ చైర్మన్ పదవిలో రమేష్ ఉన్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్లతో కలిపి ప్రస్తు తం మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం 30 దాటింది. మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఎక్స్ ఆఫిషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్ బలం 40కి చేరే అవకాశం ఉంది.
వీళ్లద్దరిలో అసలు చైర్మన్ ఎవరు అవుతారనే దాని పైన సస్పెన్స్ నెలకొం ది. ఇంకో ఏడాదిలో పాలకవర్గాల పదవీ కాలం పూర్తివుతుంది. ఇప్పుడు చైర్మన్‌గా ఎన్నికయ్యే వారే వచ్చే టర్మ్‌లో కూడా కొనసాగుతారని చెబుతు న్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లే వచ్చే టర్మ్‌లో కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నికయ్యే చైర్మన్ పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి వైపే ఉన్నారని చెబుతున్నారు. అదే నిజమైతే ర మేశ్ గౌడ్‌కు ఏ పదవి దక్కుతుందనేది ఇప్పటికైతే సస్పెన్స్.
2020 ఎన్నికల్లో మరోసారి చేజారిన పీఠం..
2020 ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రకటిం చడంతో ఎన్నికల్లో కౌన్సిలర్ల గెలుపు కోసం గట్టిగానే కష్టపడ్డారు. 48వార్డు లకుగాను 20చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బలం చాలకపోవడంతో ఇండిపెడెం ట్ ఒకరు, బీజేపీ కౌన్సిలర్ల సపోర్ట్‌తో చైర్మన్ కావాలని భావించారు. కానీ తీరా పాలకవర్గం ఎన్నికల టైంలో బీజేపీ హ్యాండ్ ఇచ్చి, బీఆర్ఎస్కు సపో ర్ట్ చేయడంతో శ్రీనివాస్ రెడ్డికి మరోసారి చైర్మన్ ఛాన్స్ చేజారింది.
ఇక బీ ఆర్ఎస్లో అబ్బగోని రమేశ్, పిల్లి రామరాజు యాదవ్‌లు చైర్మన్ కోసం పో టీపడ్డారు. 2020 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న రమేశ్ గౌడ్ చై ర్మన్ పదవి ఆఫర్ చేయడంతో బీఆర్ఎస్లో చేరారు. కానీ అప్పటి ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన ప్రధాన అనుచరుడు మందడి సైదిరెడ్డికి చైర్మన్ పదవి కట్టబెట్టారు. చైర్మన్ కావాల్సిన రమేశ్ చివరకు వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ ఎత్తు ల్లో భాగంగా చైర్మన్ కావాల్సిన శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్ గౌడ్ గత రెండు టర్మ్ ల పాలనలో వైస్ చైర్మన్ పదవులతోనే సంతృప్తి చెందారు.