
జమ్మూకాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాతో భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేత మొదలుపెట్టింది. గతమూడు రోజులుగా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులకోసం జల్లెడపడుతోంది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులను గుర్తించి వారి ఇళ్లను నేలమట్టం చేసింది. తాజాగా జమ్మూకాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాదుల మొత్తం లిస్టును నిఘా సంస్థలు వెల్లడించారు.
20నుంచి 40 ఏళ్ల వయసులో గల మొత్తం 14 మంది స్థానిక వ్యక్తులు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు లాజిస్టికల్, గ్రౌండ్ లెవెల్ మద్దతును అందింస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. పాకిస్తాన్ కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలతో అనుబంధం ఈ 14 మంది పనిచేస్తున్నట్లు నిర్ధారించారు.
ఆదిల్ రెహమాన్ డెంటూ, ఆసిఫ్ అహ్మద్ షేక్, అహ్సాన్ అహ్మద్ షేక్, హారీష్ నజీర్, అ మీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్, ఆసిఫ్ అహ్మద్ ఖండే, నసీర్ అహ్మద్ వానీ, షాహిద్ అహ్మద్ కుటాయ్, అమీర్ అహ్మద్ దార్, అద్నాన్ సఫీ దార్, జుబైర్ అహ్మద్ వానీ, హరూన్ రషీద్ గనై, జాకీర అహ్మద్ గనీ అనే ఈ 14మంది తీవ్రవాదులతో సంబంధాలున్న జమ్మూకాశ్మీర్ స్థానికులుగా నిఘా వర్గాలు గుర్తించాయి.
►ALSO READ | తటస్థ విచారణకు సిద్ధం: మౌనం వీడిన పాక్ ప్రధాని
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులపై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులతో ఈ 14మంది ఎలా లింక ప్ అయ్యారు అనే దానిపై ఏజెన్సీలు నిమగ్నమయ్యాయి. అనాగరిక ఉగ్రదాడికి కారణమైన ఐదుగురు ఉగ్రవాదులను ఇప్పటికే గుర్తించాయి. పాకిస్తాన్ కు చెందిన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా ల స్కెచ్ లను ఇప్పటికే రిలీజ్ చేశాయి. మరో ఇద్దరు పహల్గాలోయకు చెందిన ఆదిల్ గురి, అహ్సాన్ గా గుర్తించారు. వీరిపై ఒక్కొక్కరిపై రూ. 20లక్షల రివార్డును ప్రకటించారు.