ఏజెంట్, భోళా ఢమాల్.. అయ్యయ్యో అనిల్ సుంకర పరిస్థితి ఏందీ?

 ఏజెంట్, భోళా ఢమాల్.. అయ్యయ్యో  అనిల్ సుంకర పరిస్థితి ఏందీ?

అనిల్ సుంకర( Anil Sunkara).. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంచు మనోజ్ బిందాస్ మూవీతో ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. పలు సక్సెస్ ఫుల్ మూవీస్ తో హిట్స్ చూశారు అనిల్ సుంకర. కానీ  రీసెంట్ గా అఖిల్ తో ఏజెంట్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో భోళా శంకర్(Bhola shankar) మూవీ తీశారు. అఖిల్ ఏజెంట్ మూవీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా భారీ స్థాయిలో తెరకెక్కింది.  ఏజెంట్ బడ్జెట్ దాదాపు 70 కోట్లు. కానీ వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. పెట్టిన బడ్జెట్ లో 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది ఏజెంట్ మూవీ. దీంతో కోలుకోలేని డిజాస్టర్ ను చవిచూశారు అనిల్ సుంకర. 

ఇక అతని ఆశలన్నీ చిరు భోళా శంకర్ మూవీపై ఉండటంతో.. రీసెంట్ గా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి మిక్సెడ్ టాక్ తో రన్ అవుతోంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 101 కోట్లు.  ఫస్ట్ డే 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్.  ఈ సినిమాకి వచ్చిన టాక్ కి 50 కోట్లు రావడం కూడా కష్టమే అన్నట్లు థియేటర్లో నడుస్తుంది. భోళా శంకర్ మూవీతో పాటు..రజినీ జైలర్ మూవీ సేమ్ టైంలో రిలీజ్ అయ్యాయి. రజినీ జైలర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. జైలర్ కలెక్షన్స్ లో దూసుకెళ్తుండటంతో.. భోళా మూవీ డీలా పడిపోయింది.

స్టార్ అజిత్ తమిళ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా వచ్చిన భోళా శంకర్ నార్మల్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. దీంతో భోళా శంకర్ కలెక్షన్స్ అంతగా రాలేదు. చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. భోళా శంకర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు సమాచారం. మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటిరోజు రూ.12 కోట్లు కలెక్ట్ చేయగా..మిగిలిన ప్లేసెస్ లో కలిపి రూ.3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
 
ఇక భోళా శంకర్ సినిమాకు దాదాపు రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. ఇక సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

ఇక చిరంజీవి భోళా శంకర్ మూవీకి దాదాపు రూ.65 కోట్ల రెమ్యునరేషన్‌ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని మూవీ రిలీజ్ కు ముందే ఇచ్చారని సమాచారం. కానీ, భోళా శంకర్ మూవీ ఎటువంటి ఓటీటీ బిజినెస్ చేయకపోవడంతో.. భారీగా నష్టాలూ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం అనిల్ సుంకర షాద్‌నగర్, సూర్యాపేటలో ప్లాట్లు అలాగే హైదరాబాద్‌లోని తన విలాసవంతమైన ఇల్లు వంటి ఆస్తులను తాకట్టు పెట్టవలసి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇక చిరు పైనే ఆశలన్నీపెట్టుకున్నందుకు..తన రెమ్యూనరేషన్ లో సగం అయినా తిరిగి ఇస్తాడో..లేదో చూడాలి అంటున్నారు సినీ వర్గాలు. 

టాలీవుడ్ ప్రోడ్యుసర్స్ లో సక్సెస్ ఫుల్ ఇమేజ్ తెచ్చుకున్నారు అనిల్ సుంకర. మహేష్ బాబు తో దూకుడు, సరిలేరు నీకెవ్వరూ,లెజెండ్ మూవీతో.. స్టార్ ప్రొడ్యూసర్ ఇమేజ్ తెచ్చుకున్నారు అనిల్. కానీ అల్లరి నరేష్ బంగారు బుల్లోడు, వెంటనే మహా సముద్రం, ఏజెంట్ మూవీస్ తో రెండేళ్లలో భారీ డిజాస్టర్స్ చూస్తున్నారు. ఇక మెగాస్టార్ భోళా మూవీతో ఆశలు పెట్టుకున్న అనిల్ సుంకర..కనీసం మెగాస్టార్ మూవీతో  అయినా బయట పడుతాడో..లేదో చూడాలి. 

రీసెంట్ గా అనిల్ సుంకర నుంచి చిన్న మూవీగా వచ్చిన సామజవరాగమనా పెద్ద సక్సెస్ అయింది. అలాగే అశ్విన్ బాబు హీరోగా వచ్చిన హిడింబా మూవీ కూడా యావరేజ్ హిట్ అయ్యింది. కానీ డిజాస్టర్ పొందిన మూవీస్ బడ్జెట్ వేరు..చిన్న మూవీస్ కలెక్షన్స్ వేరు.    
ఇక అల్లరి నరేష్ హీరోగా వచ్చిన యాక్షన్ త్రీడీ అనే కామెడీ మూవీకి డైరెక్టర్ గావర్క్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించిన ఈ మూవీ ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చింది.