
మల్యాల, వెలుగు: ‘దుబాయ్‌లో ఉపాధి కల్పిస్తామని తీసుకెళ్లి ఏజెంట్ మోసం చేసిండు. కాపాడండి’ అంటూ ఓ యువకుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్చేశాడు. వీడియోలోని వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన బొమ్మబోయిన శ్రీనివాస్ గౌడ్(35) ఏడాది కింద ఉపాధి కోసం ఏజెంట్ సాగర్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక శ్రీనివాస్‌ను ఓ రూమ్‌లో బంధించారు. పాస్‌పోర్ట్, ఇతర ఐడీ కార్డులు గుంజుకొని పాకిస్తాన్ వ్యక్తులకు అప్పగించి డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు.
విడిచిపెట్టాలని అడిగితే జైలులో పెట్టిస్తామని బెదిరించారు. కార్లలో తిప్పుతూ కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. దీంతో తనను కాపాడాలంటూ అక్కడి గల్ఫ్ పరిరక్షణ సమితి సభ్యుడు యాగండ్ల రమేశ్‌ను వీడి యోలో వేడుకున్నాడు. శ్రీనివాస్‌కు భార్య, కొడుకు ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.