ఏజెంట్స్ మోసం.. అమెరికా వెళ్తున్న ఇద్దరు ఇండియన్స్ కిడ్నాప్.. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారంటే..?

ఏజెంట్స్ మోసం.. అమెరికా వెళ్తున్న ఇద్దరు ఇండియన్స్ కిడ్నాప్.. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారంటే..?

‘‘అమెరికా తీసుకెళ్తాం. అది కూడా లీగల్ గా. అక్కడే జాబ్ ఇప్పిస్తాం. దీనికి ముందు రూ.2 లక్షలు ఉంటే సరిపోతుంది..’’అని చెప్పి ఇద్దరు ఇండియన్ యువకులను కిడ్నాప్ చేశారు ఏజెంట్స్. నమ్ముకున్న ఏజెంట్సే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. యూఎస్ కు వెళ్తూ మార్గమధ్యలో, దేశంకాని దేశంలో బంధించి.. డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఇండియాలో ఉన్న పేరెంట్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

ఆ మధ్య వచ్చిన ‘గోట్ లైఫ్’ అనే సినిమాను తలపిస్తున్న ఈ స్టోరీ హర్యానా, పంజాబ్ కు చెందిన ఇద్దరు యువకులకు సంబధించినది. బాధితుడి తండ్రి కుల్దీప్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. తన కొడుకు యువరాజ్ సింగ్ యూఎస్ కు వెళ్లేందుకు లీగల్ గా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. దీనికోసం మొత్తం రూ.41 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు ఏజెంట్. ముందుగా రూ.2 లక్షలు ఇస్తే సరిపోతుంది అని 2024 అక్టోబర్ లో తన కొడుకును తీసుకుని ఏజెంట్ బయలుదేడని తెలిపాడు. 

యువరాజ్ పాస్ పోర్ట్ తీసుకున్న ఏజెంట్.. మిగతా ఎమౌంట్ యూఎస్ చేరినాక పంపితే చాలని నమ్మించాడు. ఆ తర్వాత అడ్వాన్స్ ఇంకొంత ఇవ్వాలని, వెంటనే రూ.14 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు యువరాజ్ తండ్రి తెలిపాడు. చివరికి యువరాజ్ ను గ్వాటెమాలాలో బంధించాడని తండ్రి వాపోయాడు. 

కిడ్నాపర్ తన కొడుకు యువరాజ్ తో పాటు, పంజాబ్ హొషియార్పూర్ కు చెందిన మరో యువకుడిని టార్చర్ చేస్తున్న వీడియో సెండ్ చేశారని, చేతులు కట్టేసి ఉన్న యువకులు టార్చర్ భరించలేక తమను ఆదుకోవాలని రోధిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, తమను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్న వీడియో ఏజెంట్లు పంపడంతో కుటుంబ సభ్యులు బోరున ఏడుస్తూ పోలీసులను ఆశ్రయించారు. భారత ప్రభుత్వం ఎలాగైనా తమ పిల్లలను కాపడాలని కోరుతున్నారు. 

సోమవారం (మార్చి 10) కుటుంబ సభ్యులు, మోహన గ్రామస్థులతో కలిసి ఎస్పీ రాజేశ్ కలియాను కలిశారు. తన కొడుకును వెనకకు తీసుకురావాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.