జీవా, అర్జున్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘అగాథియా’. ఏంజెట్స్ వర్సెస్ డెవిల్స్ అనేది ట్యాగ్‌లైన్. పా విజయ్ దర్శకుడు. డా.ఇషారి కె గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్నారు. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. 82 ఏళ్ల క్రితం ఈ బంగ్లాలో ఏవేవో సంఘటనలు జరిగాయి.. అంటూ హీరో బ్రిటీష్ కాలం నాటి ఓ పాత ప్యాలెస్‌లోకి వెళ్తాడు. అప్పట్లో జరిగిన కొన్ని హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన విజువల్స్ కనిపిస్తాయి.
ఆ ఓల్డ్ స్టోరీకి తమకు ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేస్తుంది హీరోయిన్. కానీ సంబంధం ఉందంటూ ముందడుగు వేసిన అతను ఏం తెలుసుకున్నాడు.. అప్పట్లో ఏం జరిగింది అనే ఆసక్తి రేకెత్తించేలా టీజర్ కట్ చేశారు. ఈ ఫ్యాంటసీ అండ్ హారర్ థ్రిల్లర్‌కు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. జనవరి 31న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.