![శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం..](https://static.v6velugu.com/uploads/2024/11/aghori-life-end-atempt-at-srikalahasti_7nRkN9vcEP.jpg)
వేములవాడ స్వామిని దర్శనం చేసుకున్న మహిళా అఘోరీ.. ఇప్పుడు శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర హల్ చల్ చేసింది. స్వామి దర్శనానికి వచ్చిన అఘోరీని ఆలయంలోనికి అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన పోలీసులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అఘోరీపై బిందెలతో నీళ్లు పోశారు. తరువాత ఆమె మాట్లాడుతూ ఎలాగైనా స్వామిని దర్శించుకొని తీరుతానని తెలిపింది.