
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి చేవెళ్ల కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. జైలు అధికారులు అఘోరి శ్రీనివాస్ కు షాక్ ఇచ్చారు. అఘోరి ట్రాన్స్ జండర్ అయినందున లింగ నిర్దారణ కాకుండా ఏ బ్యారక్ లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు తిప్పి పంపారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్లు వైద్య పరీక్షలు జరిపి అఘోరి శ్రీనివాస్ కు లింగ నిర్దారణ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ఇదిలా ఉంటే అఘోరీ శ్రీనివాస్ ను సంగారెడ్డి జైలుకు తరలించగా అరుపులు.. కేకలతో అక్కడ హంగామా సృష్టించాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలని అఘోరి పట్టుబట్డాడు. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీకి చేవెళ్ల కోర్టు రిమాండ్ విధించింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి లింగా నిర్దారణ విషయంలో ట్రాన్స్ జండర్ ఫిమేల్ వైద్యులు ధృవీకరించారు.
Also Read:-ఎట్టకేలకు అఘోరీ అరెస్టు.. యూపీ నుంచి నార్సింగి స్టేషన్కు.. అఘోరీ వెంటే వర్షిణి
దీంతో సంగారెడ్డి జైలు అధికారులు అఘోరీ శ్రీనివాస్ అనుమతి నిరాకరించారు. మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి మొకిల పోలీసులు తరలించారు. వైద్యుల నివేదిక ఆధారంగా అఘోరి ఏ జైలుకు తరలించాలో పోలీసులు నిర్ణయం తీసుకుంటారు, చంచల్ గూడ జైలులో ట్రాన్స్ జండర్లకు ప్రతత్యేక బ్లాక్ ఉండటంతో... అఘోరి శ్రీనివాస్ ను చంచల్గూడకు తరలించే అవకాశం ఉంది.