స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసాహీ రూ.200 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  వెలుగు:  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ  స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీలో అసాహీ గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏజీఐ జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో కంపెనీలో ఏజీఐ జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకో, అనుబంధ కంపెనీలకు మైనారిటీ వాటా దక్కుతుంది.  ఏజీఐతో పాటు ఆ సంస్థకు చెందిన కస్టమర్లకు  ప్రైవేట్ లేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, -బ్రాండింగ్,  విడిభాగాలను సరఫరా  చేస్తామని స్టాండర్డ్ గ్లాస్ పేర్కొంది.  జీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాకో ఉత్పత్తులను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు గ్లాస్ -లైన్డ్ రియాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల భద్రతను పెంచేందుకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాస్ టెక్నాలజీని రూపొందిస్తామని తెలిపింది.  జపనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తమ సంస్థ ప్రవేశాన్ని ఏజీఐ జపాన్ సులభతరం చేస్తుందని స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎండీ నాగేశ్వర రావు కందుల  తెలిపారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో 36 ఎకరాల్లో భారీ స్థాయిలో గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ ప్లాంటును స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తోంది.

ALSO READ: ఆయిల్‌పామ్‌ను పరిశీలించిన విదేశీ సైంటిస్టులు