
హైదరాబాద్, వెలుగు: వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్, టాలెంట్ డెవలప్‌మెంట్ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్నట్టు అజిలిసియం ప్రకటించింది. ఇది రాబోయే 36 నెలల్లో రెండువేల ఉద్యోగాలను ఇవ్వనుంది.
ఈ సంస్థ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు డేటా, క్లౌడ్, జెన్ఏఐ, అడ్వాన్స్డ్ఎనలిటిక్స్సొల్యూషన్స్ అందిస్తుంది. పరిశోధన, ప్రతిభ అభివృద్ధికి బలమైన ఎకోసిస్టమ్‌ను పెంపొందించడం తమ లక్ష్యమని తెలిపింది. విద్యా నైపుణ్యం, పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగిస్తామని ప్రకటించింది.
లైఫ్ సైన్సెస్, బయోటెక్ రంగంలో జీసీసీల ఏర్పాటు కోసం గమ్యస్థానంగా తెలంగాణను ఆకర్షణీయంగా మార్చడానికి సహకరిస్తామని అజిలిసియం ఫౌండర్ రాజ్ బాబు చెప్పారు.