శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన కార్పొరేటర్ ..భారీగా మోహరించిన పోలీసులు

శ్రీనగర్  కాలనీ సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన  కార్పొరేటర్ ..భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్   శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది.  ఎల్లారెడ్డిగూడలో ప్రభుత్వ స్కూల్ పై  హై టెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

దీంతో జనావాసాల మధ్య నుంచి 34 కేవి హై టెన్షన్ లైన్ తొలగించాలంటూ స్థానికులు సబ్ స్టేషన్ ముందు  ఆందోళనకు దిగారు.  స్థానికులతో కలిసి సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత కూడా ఆందోళనకు దిగారు.  కరెంట్ వైర్లను తొలగించాలని డిమాండ్ చేశారు.  దీంతో పోలీసులు భారీగా మోహరించారు.