భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇల్లెందు కాంగ్రెస్ టికెట్లొల్లి ఢిల్లీకి చేరింది. బంజారాలకే టికెట్కేటాయించాలని, ఉదయ్పూర్డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశావహులు బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు ఇల్లెందు టికెట్ఫైనల్ అయిందనే ప్రచారం జరుగుతుండడంతో సోమవారం ఆశావహులు ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ స్క్రీనింగ్కమిటీ మీటింగు జరుగుతున్న టైంలో ఆఫీసు ముందు ఆందోళన చేశారు.
ALS0 READ: మొన్న కాంగ్రెస్లో.. నిన్న బీఆర్ఎస్లో..
సేవ్కాంగ్రెస్, సేవ్ఇల్లెందు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ బంజారాలకే టికెట్ఇవ్వాలని నినాదాలు చేశారు. కోరం కనకయ్యకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్చేశారు. ఆందోళన చేసిన వారిలో భూక్యా దళ్సింగ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు, ప్రవీణ్ నాయక్, అజ్మీర శంకర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, విజయలక్ష్మి, నాగేంద్రబాబు ఉన్నారు. కాగా రాష్ట్రంలోనే అత్యధికంగా 36 మందికి పైగా ఆశావాహులు ఇల్లెందు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.