
తాడేపల్లి.. ఉండవల్లిలో అల్లరిమూక రెచ్చిపోయింది.. కొంతమంది యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఉండవల్లి సెంటర్ లో ఓ హోటల్ పై డాడిచేశారు. అడ్డొచ్చిన వారిని చితక్కొట్టారు. ఈఘటనలో హోటల్ యజమానికి తీవ్రగాయాలు కాగా.. మరో 20 మంది కూడా గాయపడ్డారు. స్థానికులు బ్లేడ్ బ్యాచ్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇతర నగరాల నుంచి బహిష్కరణకు గురై.. ఇక్కడ నివసిస్తున్నారని సమాచారం అందుతోంది. అలాంటి వారందరూ కలిసి ముఠా గా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆకతాయిల ఆగడాలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాధిత హోటల్ యజమాని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.