చౌటుప్పల్, వెలుగు: ట్రిపుల్ ఆర్‌లో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులు శనివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో హైవేపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్‌లో భూమి కోల్పోతున్న వారికి మరో చోట భూమి ఇవ్వడంతో పాటు, ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ రేటు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న రేటు సరిపోకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మంత్రి వెంకట్‌రెడ్డి, ఎంపీ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని నిర్వాసితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం లింగారెడ్డిగూడెంలోని ఫంక్షన్‌హాల్‌లో త్రిపుల్ ఆర్ నిర్వాసితుల సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దటి బుచ్చిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బోరం నర్సిరెడ్డి, రైతు నాయకులు పల్లె శేఖర్‌రెడ్డి, ఆకుల ధర్మయ్య, బోయ యాదయ్య, గుండెబోయిన వెంకటేశం, గోపగొని లక్ష్మణ్, ఉష్కాగుల రమేశ్ పాల్గొన్నారు.