జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యార్థినులు క్లాసులు మానేసి ఆందోళనకు దిగారు. తమను ప్రిన్సిపాల్ చైతన్య వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. పాఠశాల నుండి చైతన్యను బదిలీ చేయాలంటూ నినాదాలు చేశారు. రోడ్డు పై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ప్రిన్సిపాల్‌ను బదిలీ చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థినులు చెబుతున్నారు. తమకు ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వడం లేదని.. కనీసం దెబ్బలు తగిలినా ఇంటికి పంపించడం లేదని విద్యార్థినులు వాపోయారు. ఇలాంటి ప్రిన్సిపాల్ తమకు వద్దంటూ ఆందోళన చేస్తున్నారు.