జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా మున్సిపల్ లో జేసీబీ, ట్రాక్టర్స్ యజమానులు, కూలీలు కలిసి మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. పట్టణ ప్రగతిలో వివిధ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలంటూ మున్సిపల్ ఆఫీసు ముందు ట్రాక్టర్ అడ్డుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏఈ, కమిషనర్, ఛైర్మన్లు వెంటనే రావాలని నినాదాలు చేశారు. తమతో పనులు చేయించుకుని.. బిల్లులు చెల్లించడం లేదని ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్లు వచ్చి తమతో మాట్లాడే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ట్రాక్టర్ ను రోడ్డుపైనే నిలిపివేసి, ఆందోళన చేయడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.