పంచాయతీ కార్మికుల ఆందోళన

పంచాయతీ కార్మికుల ఆందోళన

కారేపల్లి, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎనిమిది  నెలల నుంచి పెండింగ్​లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎంపీవో పర్వీన్ కైసర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు హుస్సేన్, కొమురయ్య వెంకటేశ్, సూర్యనారాయణ మోతిలాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.