గూడూరు, వెలుగు: మండలంలోని నాయక్ పల్లి గ్రామానికి చెందిన 80మందికి ఇండ్ల పట్టాలిచ్చి, స్థలం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. బుధవారం మండలానికి వచ్చిన కలెక్టర్ శశాంకను కలిశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 1999లో అప్పటి ప్రభుత్వం తమకు ఇండ్ల పట్టాలుఇచ్చిందని
ఇందుకు 4ఎకరాల స్థలం కోసం ఒక్కొక్కరి నుంచి 13వందలు వసూల్ చేసి తమను భాగస్వాములు చేశారని తెలిపారు. ఎమ్మెల్యేలు మారినా తమకు మాత్రం ఇండ్ల స్థలాలు రావడం లేదని ఆవేదన చెందారు. కలెక్టర్ శశాంక దృష్టికి విషయం తీసుకెళ్లగా.. పరిశీలించాలని తహసీల్దార్ అశోక్ కుమార్ కు ఆదేశించారు.