అడ్వకేట్ పై దాడికి నిరసనగా ఆందోళన

ఎల్ బీనగర్,వెలుగు: సిద్దిపేటలో అడ్వకేట్ పై పోలీసుల దాడి.. అక్రమ కేసుపై నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోయేషన్ ఆధ్వర్యంలో లాయర్లు గురువారం కోర్టు విధులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. సిద్దిపేటలో ఓ కేసులో నిందితులను లాయర్ రవికుమార్ విచారిస్తుండగా.. తమ విధులకు ఆటంకం కలిగించాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల తీరును నిరసిస్తూ లాయర్లు గురువారం కోర్టుల విధులను బహిష్కరించి, ఆందోళన చేపట్టారు. లాయర్ల విధులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, సభ్యులు పీఠం ప్రదీప్ కుమార్, నర్సింగోజు నరేశ్ కుమార్, విజయ్ నాయక్ , గురువయ్య, రాకేశ్​ తదితరులు పాల్గొన్నారు.