ఆదిలాబాద్​ రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : ఏజీఎం ధనుంజయ్

  • దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ధనుంజయ్

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్​కు భవిష్యత్తులో ఎక్స్​ప్రెస్ రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే అదనంగా రైల్వే లైన్లు వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ధనుంజయ్ వెల్లడించారు. ఆదిలాబాద్ రైల్వేస్టేషన్​ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి ఇక్కడ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమృత్ భారత్ పథకం కింది ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తున్నామని, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే రూ.253 కోట్ల నిధులతో కొత్త రైల్వే పిట్ లైన్, అదనపు రైల్వే లైన్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రైల్వే లైన్లు పూర్తయితే ఎక్స్​ప్రెస్ రైళ్లు నడిచే ఆస్కారం ఉంటుందన్నారు.