అగ్ని వీర్ స్కీం దరఖాస్తుకు 2 రోజులే గడువు మారిన ఈ 4 రూల్స్ తెలుసుకోండి

అగ్ని వీర్ స్కీం దరఖాస్తుకు 2 రోజులే గడువు మారిన ఈ 4 రూల్స్ తెలుసుకోండి

భారతీయ సైన్యంలో ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 13న అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు joinindianarmy.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో  దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 22 దరఖాస్తు చివరి తేదీ కాగా... ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. ఈసారి అగ్ని వీర్ స్కీంలో కొన్ని సవరణలు చేశారు. అడాప్టబిలిటీ టెస్ట్, అగ్నివీర్ క్లర్క్ పోస్టులను  ఆఫీస్ అసిస్టెంట్ గా పేరు మార్చారు.  ఈ పోస్టులకు పోటీ పడే వారికి కొత్తగా టైపింగ్ టెస్ట్​ కూడా పెడతారు. ఒకరి బదులు మరొకరు రిక్రూట్​మెంట్ ర్యాలీలో పాల్గొని మోసాలకు పాల్పడకుండా ఈసారి నుంచి అభ్యర్థులకు ఐరిస్ స్కాన్​ చేయనున్నారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్​ను ఈ రిక్రూట్​మెంట్​లోనే మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. 

గతంలో ఐఐటీ చేసిన వారికి మాత్రమే టెక్నికల్ రిక్రూట్​మెంట్​కు ఎలిజిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు పాలిటెక్నిక్​ అభ్యర్థులకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. అగ్నివీర్ పథకం కింద ఇండియన్ ఆర్మీలోకి మహిళా ఆర్మీ పోలీస్, హవల్దార్, సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్, కానిస్టేబుల్ ఫార్మా, నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు సైన్యంలో తాత్కాలికంగా 4 ఏళ్లపాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఉన్నవారిలో 25శాతం మందిని పర్మినెంట్ రిక్రూట్‭మెంట్ లోని  తీసుకుంటారు. మిగతా వారిని ఫైనల్ సెట్టిల్ మెంట్ కింద కొంత డబ్బు ఇచ్చి సర్వీస్ నుంచి తొలగిస్తారు. అగ్ని వీర్ స్కీం కు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చి 22.. ఇండియాన్ ఆర్మీలో జాబ్ చేయాలనుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. వీరికి ముందు  ఫిజికల్ టెస్ట్, తర్వాత రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ALSO READ :- ప్రణీత్ రావు కేసులో ముగిసిన వాదనలు..హైకోర్టు తీర్పు రిజర్వ్