జనవరి 6 నుండి మార్చి 9 వరకు.. సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త అందుతోంది. 2025 జనవరి 6 నుండి మార్చి 9 మధ్య సికింద్రాబాద్‌లోని జోగిందర్ సింగ్ స్టేడియం, AOC సెంటర్‌లో అగ్నివీర్(ఆర్మీ) రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు జరగనున్నాయి. 17 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ర్యాలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/SKT (AOC వార్డ్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీల్లో ఈ భర్తీలు చేపట్టనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి/మెట్రిక్ కనీసం 45 శాతం మార్కులతో (ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/SKT కొరకు అభ్యర్థులు తప్పనిసరిగా ఏదేని విభాగంలో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉతీర్ణులై ఉండాలి. అంతేకాదు, ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ కు 10వ తరగతి పాసై ఉంటే చాలు. 

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ప్రధాన కార్యాలయం AOC సెంటర్, ఈస్ట్ మారేడ్‌పల్లి, తిరుమల గిరి, సికింద్రాబాద్‌లో సంప్రదించవచ్చు. సమాచారం కోసం tuskercrc-2021@gov.inకు ఇమెయిల్ చేయవచ్చు లేదా www.joinindianarmy@nic.inని సందర్శించవచ్చు.