ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలో శుక్రవారం నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ర్యాలీ జరగనుంది. గురువారం కలెక్టర్ గౌతమ్ , ఆర్మీ కల్నల్ కీట్స్ కె దాస్, సీపీ విష్ణు ఎస్. వారియర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్నివీర్ రిక్రూట్మెంట్రెండు దశల్లో జరుగుతుందని, ముందు ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించగా 7,397 మంది సెలెక్టయ్యారన్నారు. వీరికి రెండో దశలో ఖమ్మంలో శుక్రవారం నుంచి ఫిజికల్, హెల్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థుల అడ్మిట్ కార్డులోనే ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి రిపోర్ట్ చేయాలో పేర్కొన్నట్టు చెప్పారు.
అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకొని, సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఉచిత వసతి ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంబేద్కర్ భవన్ సూపరిండెంట్ హనుమంతరావు 9849689815, గిరిజన భవన్ ఏటీడీవో తిరుమలరావు 9346449958, టీటీడీసీ గోపీలాల్ 9291482855 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. సర్దార్ పటేల్ స్టేడియంతో పాటు ఎస్ ఆర్అండ్ బీజీఎన్ఆర్కళాశాల గ్రౌండ్ లో ర్యాలీ ఉన్నందున వాకర్స్, క్రీడాకారులకు స్టేడియంలోకి ఈ నెల 8 వరకు అనుమతి లేదన్నారు.