ఆర్మీలో చేరి దేశానికి సేవలందించాలనుకునే రాష్ట్ర యువతకు శుభవార్త అందుతోంది. తెలంగాణలో అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు, వేదిక ఖరారయ్యాయి. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరగనున్నాయి.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన యువతను సైన్యంలో అగ్నివీరులుగా చేర్చుకోవడానికి ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీల్లో ఈ భర్తీలు చేపట్టనున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత కాగా.. ఇతర విభాగాలకు పదో తరగతి ఉతీర్ణులై ఉండాలి.
అలాంటివి నమ్మొద్దు
డబ్బులిస్తే రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించడానికి సాయం చేస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దని అధికారులు యువతకు సూచించారు. మోసపూరిత హామీల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 040-27740059, 27740205 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ALSO READ | Bank Jobs: 600 బ్యాంకు కొలువులు.. ఏడాదికి రూ.6.50 లక్షల వరకు జీతం