
ఇండియన్ ఆర్మీ చెన్నైలోని జోన్ రిక్రూటింగ్ ఆఫీస్ అగ్నిపథ్ పథకం కింద 2024–25 సంవత్సరం రిక్రూట్మెంట్లో భాగంగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ(మహిళా మిలటరీ పోలీసు) అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: 45శాతం మార్కులతో పదో తరగతి, ప్రతి సబ్జెక్టులో 33శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవర్ నియామకాల్లో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి(కరైకాల్, యానాం, పుదుచ్చేరి), అండమాన్ అండ్ నికోబార్, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులు. వయసు 17– 1/2 నుంచి 21ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మార్చి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.joinindianarmy.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.