మైండ్ ఉందా : రన్నింగ్ కారులో జూనియర్ పై.. సీనియర్ అత్యాచారం

మైండ్ ఉందా : రన్నింగ్ కారులో జూనియర్ పై.. సీనియర్ అత్యాచారం

సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో లేక దిగజారుతున్న విలువలకు నిదర్శనం అనాలో తెలీదు కానీ, ఇటీవల కాలంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆరేళ్ళ పాప నుండి అరవైయేళ్ల వృద్ధురాలి వరకు వయసు, వావి వరస చూడకుండా అత్యాచారానికి పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా ఆగ్రాలోని ఓ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఆగ్రాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. రన్నింగ్ కారులో యువతిని రేప్ చేసి ఆమెను రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం, నిందితుడు, అదే కాలేజీకి  చెందిన సీనియర్ శివంగ్ సింగ్ తనను కలవడం కోసం రమ్మని బలవంతంగా కారులో ఎక్కించుకొని రేప్ చేసినట్లు తెలుస్తోంది.ఆగస్టు 10 సాయంత్రం సికంద్రా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో తన చేతులను కట్టేసి, వెనుక సీటుకు డ్రైవర్ సీటుకు మధ్యలో కర్టెన్ వేసి ఎవరూ చూడకుండా కారు అద్దాలను మూసేసారని యువతి తెలిపింది. తనను వదలమని ఎంత బిగతిమాలినా కూడా వినకుండా చంపుతామని బెదిరించి రేప్ చేశారని తెలిపింది.

అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు తనను కారు నుండి బయటకు విసిరి పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.గత 10 రోజులుగా ఐఐటీ జమ్మూకశ్మీర్‌లో ఉన్నానని, మరెక్కడికీ వెళ్లలేదని పేర్కొంటున్న నిందితుడి కోసం దర్యాప్తు ప్రారంభించామని, ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీటీవీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది, దర్యాప్తు ముమ్మరం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజాసంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.