Viral news: బొట్టు బిల్లలు(టిక్లీలు) కొనివ్వలేదని భర్తకు విడాకులిచ్చిన భార్య..

Viral news: బొట్టు బిల్లలు(టిక్లీలు) కొనివ్వలేదని భర్తకు విడాకులిచ్చిన భార్య..

ఇదో విచిత్రమైన సంఘటన..రోజూ పెట్టుకునే బొట్టుబిల్లల విషయంలో కలత చెందిన ఓ మహిళ..దాంపత్య జీవితాన్ని తెంచుకునే నిర్ణయం తీసుకుంది..రోజూ రకరకాల బొట్టు బిల్లలతో స్టైలిష్ గా అలంకరించుకుని ఆనందపడే ఆ మహిళ..రోజుకో రకం బొట్టుబిల్లలు తెచ్చిచ్చేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు లోనయిన ఆమె.. తన కోరిక తీర్చని భర్తకు విడాలిచ్చేందుకు వెనకాడలేదు. యూపీలోని ఆగ్రాలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది.  

ఆగ్రాకు చెందిన ఓ మహిళ బొట్టుబిల్లలు కొనివ్వలేదని గొడవకు దిగింది.. అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.  నేను తెమ్మన్న బొట్టుబిల్లలు కొనివ్వడం లేదు..ఇక నేను అతని తో కాపురం చేయను.. అని ఏకంగా కట్టుకున్న భర్తకు విడాలిచ్చేందుకు సిద్దమైంది. 

ఆగ్రాకు చెందిన ఓ మహిళకు రోజుకో రకం బొట్టు బిల్లలు పెట్టుకొని అందంగా అలంకరించుకొని ఆనందపడిపోతూ ఉంటుంది..ఆమె భర్త కూడా రకరకాల బొట్టుబిల్లలు తెచ్చి ఇచ్చేవాడు.. ఇలా వారానికి ఏడు రకాల బొట్టుబిల్లలు కొనితెచ్చేవాడు. అయితే స్టిక్కర్లు తరుచుగా పడిపోతున్నాయని చెప్పడంతో వాటిని వారానికి 30నుంచి 35 వరకు పెంచాడు. అయినా ఆమె సంతృప్తి చెందలేదు.. ఎప్పుడు కొత్తకొత్తవి కావాలని కోరింది. దీంతో వారిమధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

ఓ రోజు గొడవలు ముదరడంతో అన్ని సర్దుకొని పుట్టింటికి వెళ్లింది ఆ మహిళ. తన కోరిక తీర్చలేదని భర్తకు విడాకులిస్తానని తెగేసి చెప్పింది. ఆమె ప్రవర్తనా తీరును చూసిన ఇరువురి కుటుంబ సభ్యులు కౌన్సిలర్ అయిన ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. భార్యభర్తలిద్దరికి  కౌన్సిలింగ్ నిర్వహించిన డాక్టర్..ఆమె భర్తను ఒప్పింది.. ఆమెను శాంతింపజేసి కాపురానికి వెళ్లేలా చేశాడు. తాను  ట్రీట్మెంట్ఇచ్చిన జంట గురించి చెపుతూ..వారి వివరాలు వెల్లడించకుండా జరిగిన సంఘటనను చెప్పా డు. దీంతో  ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఆగ్రాలో ఇలాంటి అసాధారణ సంఘటన కొత్తేమీ కాదు..ఇదివరకు ఓ కేసు నమోదు అయింది. భర్త తన కోసం మోమోస్ తీసుకురావడం మర్చిపోయాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఈ విచిత్రమైన వివాదాన్ని పరిష్కరించేందుకు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.  ఆ భర్త తన భార్యకు వారానికి రెండుసార్లు మోమోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.