తునికాకు సేకరణ టెండర్లను పూర్తి చేయాలి

  •     ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట కార్మికుల ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తునికాకు సేకరణ టెండర్లను పూర్తి చేసి, ప్రూనింగ్​ పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలోని ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఆర్​. శ్రీనివాస్​ మాట్లాడుతూ తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇంకా ఆలస్యం అయితే క్వాలిటీ తునికాకు లభించదని ఆందోళన వ్యక్తం చేశారు.

సకాలంలో ప్రూనింగ్​ పనులు జరిగితేనే నాణ్యమైన తునికాకు లభిస్తుందన్నారు. పెండింగ్​లో ఉన్న తునికాకు బోనస్​ను చెల్లించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అటవీశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రోగ్రాంలో నాయకులు శెట్టి వినోద, ఈసం నరసింహరావు, రాములు, జోగా దశరత్, ఎర్రయ్య పాల్గొన్నారు.