పొలాల్లో మోటర్ల దొంగతనం..నిందితులు అరెస్ట్

జగిత్యాల, వెలుగు : జిల్లాలో పలుచోట్ల వ్యవసాయ బావుల వద్ద మోటర్ల దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. గురువారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల అర్బన్ పరిధిలోని ధరూర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేయగా ఓ కారులో వ్యవసాయ మోటర్లు, కట్టర్లు  కనిపించాయి.

అందులోని వ్యక్తులను విచారించగా రాయికల్, బీర్పూర్,  మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలాల్లో చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరుకు చెందిన  చిన్నమనేని మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బసగుట్ట నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్​చేశారు.

వారి వద్ద 22 మోటర్లు, మోటర్లను కత్తిరించడానికి ఉపయోగించే సామగ్రి, కారును స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్​ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటస్వామి, సీఐ ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు.