పత్తి పంట కూపన్ల కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయ అధికారి

పత్తి పంట కూపన్ల కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయ అధికారి

వేసిన పంట చేతికొచ్చే దాకా రైతుకు నిద్ర ఉండని రోజులివి. పోనీ అన్నీ సజావుగా సాగి పంట చేతికొచ్చినా.. సరైన గిట్టు బాటు ధర దక్కుతుందో లేదో అన్న మరో బెంగ. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ ఉద్యోగుల లంచాల వేధింపులు మరోవైపు. పంట వేయడానికి అవసరమైన విత్తనాలు కావాలన్నా లంచం.. పండిన పంట అమ్ముకోవాలన్నా లంచం. డబ్బుపై వ్యామోహంతో ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజలను పీక్కు తినేస్తున్నారు. 

Also Read :- ఏసీబీకి పట్టుబడిన TSCCDCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఆరుగాలం ఎంతో శ్రమించి పంటను పండించుకున్న ఓ రైతును ప్రభుత్వ వ్యవసాయ అధికారి లంచం పేరుతో వేపుకుతిన్నాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగి పేరు.. డి. శాంతన్ కుమార్(D. Shanthan Kumar). భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి. పండించిన పత్తి పంటను విక్రయించడానికి అవసరమైన కూపన్ల జారీ కోసంఓ రైతు నుంచి రూ.30వేలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు చాకచక్యంగా అతని ఆట కట్టించారు.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”