
భద్రాచలం,వెలుగు : తునికాకు టెండర్ల ను పూర్తి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘంల ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలం ఫారెస్ట్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఎఫ్డీవో సుజాతకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆలసత్వం వల్ల ఆదివాసీలు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో గెలిచిన ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి టెండర్లు పిలిచేలా, ఫ్రూనింగ్ నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి, మర్మం చంద్రయ్య, గిరిజన సంఘం బాధ్యులు రామ్మూర్తి, ఆదయ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.