కూలీలకు పని కల్పించాలి

కూలీలకు పని కల్పించాలి

యాదాద్రి, వెలుగు : ఉపాధి హామీ పనులను వేగంగా చేపట్టి.. కూలీలకు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం డీఆర్డీవో నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇప్పటికైనా అధికారులు జాబ్ కార్డ్ కలిగిన అందరికీ పని కల్పించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు పల్లెర్ల అంజయ్య, కొండాపురం యాదగిరి, రాంబాబు తదితరులు ఉన్నారు.