భూమి లాక్కోవద్దంటూ దంపతుల ఆత్మహత్యాయత్నం

దంపతుల ఆత్మహత్యాయత్నం

భూమి లాక్కోవద్దంటూ వేడుకోలు..

ములుగు, వెలుగు:  తమకు తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిలో కొంత ప్రభుత్వ భూమి కూడా ఉన్నదని ఫిర్యాదు రావడంతో వాటి యజమానులైన దంపతులు తట్టుకోలేకపోయారు. భూమిని సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్ల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ములుగు మండలంలోని మహ్మద్​గౌస్​పల్లిలో గురువారం జరిగింది. రొట్టె లింగమ్మ-, లింగయ్య దంపతులు .. ఇనామ్​గా వచ్చిన 25 గుంటల భూమిని సాగు చేస్తూ ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశారు.  అందులో 10 గుంటల మేర ప్రభుత్వ భూమి ఉందని ఎంపీటీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్​ సర్వేకోసం ఆఫీసర్లను పంపారు.  తమ భూమిని లాక్కోవద్దని ఆ దంపతులు ఆఫీసర్లను బతిమిలాడినా వినిపించుకోకపోవడంతో మనస్థాపానికి గురైన ఇరువురు దంపతులు అక్కడే పురుగుల మందు తాగారు. స్థానికులు వెంటనే వారిని ట్రీట్​మెంట్​కోసం తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

For More News..

జీహెచ్ఎంసీ బడ్జెట్​ కొండంత.. ఖర్చు గోరంత

వీధి వ్యాపారుల లోన్లపై బల్దియా నిర్లక్ష్యం