రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమించి, విరమించిన రైతులు.. ఇప్పుడు 2.0 ఉద్యమానికి సిద్ధమయ్యారు. గతంలో ఉద్యమించిన సంఘాలకు చెందినవారిలో పలువురు మళ్ళీ పోరుబాట పట్టనున్నారు. కేంద్రప్రభుత్వానికి వ్యవసాయ రంగంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంంగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు రైతు సంఘాలు ఆందోళన చేస్తామని .. కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కల్పించాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం గోధుమలకు18 శాతం, 50 శాతం వరి, 0.43 శాతం పప్పు ధాన్యాలకు ఎంఎస్పీ ధరలకు ప్రభుత్వం కొనుగోలుచేస్తుంది. ఇంకా ఆవాలు, జొన్నలు, మిల్లెట్ వంటి వాటి వాటికి చాలా తక్కువ ఎంఎస్పీ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటుధర కల్పించడంపై ప్రభుత్వం విఫలమైంది. 165 రోజులు ఉద్యమం చేసినా.. ప్రభుత్వం రైతు డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని రైతు సంఘాల నాయకులు తెలిపారు.
రైతు ఉద్యమం (2.0) ఉధృతం
దేశ వ్యాప్తంగా 40 రైతు సంఘాలతో 2.0 ఉద్యమం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ... కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM) నేతలు తెలిపారు. MSP విషయంలో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరాన్ని రైతు సంఘం నాయకులు పంధేర్ కోరారు. ఆగస్టు 1 నుంచి జరిగే 2.0 ఉద్యమ ప్రణాళికను వివరించారు. ఆగస్టు 1న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్ చేపడతామని చెప్పారు. అందుకు రైతులు కూడా సిద్ధం కావాలని కోరారు.
ఉద్యమ ప్రణాళికా వివరాలు
- ఆగస్టు 1: కొత్త క్రిమినల్ చట్టాల కాపీలను కాల్చడం ... జిల్లా ప్రధాన కార్యాలయంలో ప్రదర్శన.
- ఆగస్టు 15: ఢిల్లీకి దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్, సింగు మరియు శంభుతో సహా సరిహద్దుల వద్ద రైతులు ధర్నా
- 21 ఆగస్టు: కిసాన్ ఆందోళన్ 2.0.. 200 రోజులు పూర్తి చేసుకున్న వేడుక.
- 31 ఆగస్టు: శంభు సరిహద్దులో 200 రోజుల నిరసన వేడుకలు.
- సెప్టెంబర్ 15& 22: హర్యానాలోని జింద్ .. పిప్లీలలో రైతుల ర్యాలీలు.