
మొగుళ్ళపల్లి,వెలుగు : వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన మిరుపూరి రాజయ్య(64) శనివారం వ్యవసాయ కూలి పనులకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో పని చేస్తుండగా.. వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురవడంతో తోటి కూలీలు ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం కొద్దిసేపటికి టాయిలెట్ కు వెళ్లి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.