గ్రూప్ 1,2 స్పెషల్.. రాష్ట్ర సగటు కమత విస్తీర్ణం ఎంత?

గ్రూప్ 1,2 స్పెషల్.. రాష్ట్ర సగటు కమత విస్తీర్ణం ఎంత?

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 114.84 లక్ష హె-క్టా ర్లు. దీనిలో అటవీ భూమి 27.43లక్షల హెక్టా ర్లు (23.89 శాతం), సాగు భూమి 49.61 లక్షల హెక్టార్లు(43.2శాతం). వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి 8.95 లక్షల హెక్టార్లు(7.79శాతం). ఇదిలా ఉండగా 49.61 లక్షల హెక్టార్ల సాగు భూమిలో కమతాల సంఖ్య 55.54లక్షలు. ఈ కమతాలలో ఉపాంత కమతాలు 62శాతం, చిన్న కమతాలు23.9శాతం. అంటే మొత్తం సాగు భూమిలో85.9శాతం చిన్న, ఉపాంత కమతాలే ఉన్నాయి.మిగిలిన 14.1శాతం కమతాలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, పెద్ద కమతాలు కావడం గమనార్హం. గణాంకాలను విశ్లేషిస్తే చిన్న కమతాల యజమానుల చేతుల్లో చాలీచాలని భూమి ఉండగా, కొద్ది మంది భూస్వాముల చేతుల్లో విశాలమైన భూ క్షేత్రాలున్నాయి. రాష్ట్రంలో కమతాల సంఖ్య(55.54లక్షల హెక్టార్లు) ఎక్కువగానూ,కమత పరిమాణం(1.11హెక్టా ర్లు) తక్కువగా ఉన్నట్లు అవగతమవుతోంది.

ప్రధాన పంటలు

రాష్ట్రంలో వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న,పప్పు దినుసులు వంటి ఆహారపంటలతో పాటు, పత్తి, పొగాకు, మిరప, వేరుశనగ, పొద్దు తిరుగుడు నువ్వులు, పసుపు సోయాబీన్ వంటి ఆహారేతర పంటలను సాగు చేస్తున్నారు .రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరుస్తూ పేదరికాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.విత్తన యాజమాన్యం రైతులకు సాధికారతను కల్పించటం. అనగాసరైన సమయంలో తక్కువ వ్యయంతో నాణ్యమైన విత్తనాలను సేకరించుకోవటం. దీనికోసంతెలంగాణను ‘సీడ్ బౌల్ ఆఫ్ ది ఇండియా’గారూపొందించడం.లాభసాటిగా మార్చడంవ్యవసాయ నివేదిక ప్రకారం ప్రత్యామ్నాయ ఉపాధి దొరికితే, వ్యవసాయ రంగాన్ని వదిలేయడానికి సగంకంటే ఎక్కువ మంది రైతులు సిద్ధంగా ఉన్నారని ఆర్థిక వేత్తలు వెల్లడించారు.ఈ సమస్య నుంచి రైతులను ఆదుకోవడానికి రైతులకు రుణ సదుపాయం అందేలా చూడటం,పెట్టుబడి వ్యయంగా వానాకాలానికి రూ.4వేలు,యాసంగి కి రూ.4 వేలు మొత్తం 8వేలు ప్రభుత్వంసమకూర్చుతుంది.ఆధునిక సాగు పద్ధతులువ్యవసాయ రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్నిఅనువర్తింపజేయడం. ఉదాహరణకు సాయిల్హెల్త్ కార్డులు అందజేయడం వంటి కార్యక్రమాలను అమలు చేయడం. సమర్థవంతంగా సాగునీటిని వినియోగించుకోవడం, బిందు , తుంపరసేద్యాన్ని ఉపయోగించడం. భూసంరక్షణ చర్యలలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు భూ సంరక్షణపై అవగాహన కల్పిస్తారు .

పంటల బీమా పథకాలు

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనఈ పథకం కింద రాష్ట్రంలోని వ్యవసాయరంగాన్ని3 క్లస్టర్లుగా విభజించారు. తక్కువ పంట నష్టం గల జిల్లాలు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్.మధ్యస్థంగా పంట నష్టం గల జిల్లాలు – వరంగల్,కరీంనగర్, మహబూబ్‌ నగర్. అధిక పంట నష్టంగల జిల్లాలు నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి. 2017 ఖరీఫ్ నుంచి వరి, జొన్న, మొక్కజొన్న,వేరుశనగ, కందులు, పెసలు, మినుములు,సోయాబీన్, పసుపు, మిరప వంటి 12 పంటలకు ఈ బీమా వర్తిస్తుంది.వాతావరణ ఆధారిత పంటల బీమా 2016–17 ఖరీఫ్‌‌లో పత్తి పంటకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు . మిరప పంటకు మాత్రం ఖమ్మం, వరంగల్ జిల్లాలోఅమలులో ఉంది. బత్తాయి పంటకు నల్గొండ జిల్లా లో, ఆయిల్‌‌ ఫామ్ పంటకు ఖమ్మం జిల్లా లో అమలులో ఉంది.

గ్రామ బీమా యూనిట్

గ్రామాన్ని యూనిట్‌ గా తీసుకుని బీమానుఅమలు చేస్తారు. వరి పంటకు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్‌‌ జిల్లాల్లో అమలు చేస్తున్నారు . ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటకు, మొక్కజొన్న పంటకు మహబూబ్‌ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో అమలు చేస్తున్నారు. సమీకృత బీమా ప్యాకేజ్ ఈ పథకం కింద నిజామాబాద్ జిల్లాను ఎంపికచేశారు. రైతుకి, వ్యక్తిగత ప్రమాదబీమా, జీవితబీమా ఉంటుంది. వ్యవసాయ యంత్ర పరికరాలకు సైతం బీమా కల్పిస్తుంది. రైతు ఇంటికి బీమా,విద్యార్థి భద్రతకు బీమా సౌకర్యం ఉంటుంది.

అనుకూల అంశాలు

తెలంగాణ సమశీతోష్ణ స్థితి వాతావరణంలో ఉండటం రాష్ట్ర భౌగోళిక అనుకూలతగా చెప్పవచ్చు. రవాణా పరంగా హైదరాబాద్ నగరం దేశం మధ్యలో ఉండడం. రాష్ట్రంలో అన్ని జిల్లాలు విత్తన ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. 37.42 క్వింటాళ్ల విత్తనాలని రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది.ఇవి దేశానికి 60శాతం సమకూరుతున్నాయి.దేశంలోని హైబ్రిడ్ వరి విత్తనాలను 90 నుంచి 95శాతం ఉత్పత్తి వరంగల్, కరీంనగర్ నుంచి సేకరిస్తున్నారు . హైబ్రిడ్ జొన్న, సజ్జలు 100 శాతం నిజామాబాద్ జిల్లా నుంచి సేకరిస్తున్నారు . హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలలో 400 విత్తన కంపెనీలున్నాయి.

వర్షపాతం

పంటల తీరును ప్రభావితం చేసే మరో అంశం వాతావరణం. రాష్ట్రం లో వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారా 2014–15 సంవత్సరంలో 912 మిల్లీమీటర్లుగా నమోదైంది. 2016–17లో 713.5మి.మీగా నమోదైంది. అనగా 29శాతం తక్కువగా నమోదైంది. సాధారణ వర్షపాతం 713.5మి.మీ కాగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇది700 నుంచి 900 మి.మీగా ఉంది.

ప్రభుత్వ మద్దతు

రాష్ట్ర ప్రభుత్వం అధిక దిగుబడినిచ్చే, తక్కువఖర్చు ఉండే విత్తనాల ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తుంది. విత్తనాల ప్రాసెసింగ్ పరికరాల కొనుగోలుకు ప్రాముఖ్యాన్నిస్తుంది. విత్తన పరీక్షల ల్యాబ్ఏర్పాటు , గోదాంలను ఏర్పాటు చేస్తుంది. విత్తన ఉత్పత్తికి సంప్రదాయేతర రంగాలను ఎంపికచేస్తుంది. విత్తన గ్రామాలను బలోపేతం చేస్తుంది.రాష్ట్ర విత్తన క్షేత్రాలను ఏర్పాటు చేయడం. దీనిలోభాగంగా ‘తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్‌ మెంట్ఏజెన్సీ’ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇది ఆయిల్‌‌ఫెడ్, మార్క్‌‌ఫెడ్, హాకాలను సమన్వయంచేస్తుంది.

భారత ప్రభుత్వ గుర్తింపు

ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడురాష్ట్రాలలోని రాష్ట్ర ప్రభుత్వాలు ‘సీడ్ కార్పొరేషన్ఏజెన్సీ’ ద్వారా పండించే విత్తనాలని తెలంగాణసీడ్ కార్పొరేషన్ ఏజెన్సీ ధృవీకరించిన తర్వాతే‘ ఓఈసీడీ’ దేశాలకు ఎగుమతి చేయాలి. 2014–15 నుంచి 2018–19 వరకు సోయాబీన్ ఇతరకొత్త వంగడాలను అభివృద్ధి చేయాలని సీడ్ డెవలప్‌ మెంట్ ఏజెన్సీ ప్రణాళికా రచన చేసుకుంది.

రాష్ట్ర సగటు కమత విస్తీర్ణం

రాష్ట్ర సగటు కమత విస్తీర్ణం 1.11 హెక్టార్లు
ఇండియా సగటు కమత విస్తీర్ణం 1.16హెక్టా ర్లు.
సగటు కమతం అత్యధికంగా ఉన్న జిల్లా 1.40 హెక్టా ర్లు (ఆదిలాబాద్)
అత్యల్పంగా ఉన్న జిల్లా 0.95 హెక్టా ర్లు (నిజామాబాద్)