వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులకు పోటాపోటీ

 వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులకు పోటాపోటీ
  • లిస్టు ప్రిపేర్​ చేసిన కాంగ్రెస్​ లీడర్లు
  • వారంలో ఉత్తర్వులు వెలువడే చాన్స్
  • హస్తం శ్రేణుల్లో ఉత్కంఠ   

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని ఎనిమిది అగ్రికల్చర్​ మార్కెట్​ కమిటీలతో పాటు ఇతర నామినేటెడ్​ పోస్టుల భర్తీకి గవర్నమెంట్​చర్యలు చేపట్టింది. వాటిని దక్కించుకునేందుకు కాంగ్రెస్​ సెకండ్​క్యాడర్​ నేతల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, సెగ్మెంట్ ఇన్​ఛార్జిలు కలిసి రెడీ చేసిన మార్కెట్​కమిటీ ఏకాభిప్రాయ లిస్టును సర్కారుకు పంపించారు.  

వారం పది రోజుల్లో  కొన్ని పోస్టుల భర్తీకి అధికార ఉత్తర్వులు వెలువడే సంకేతాలు కనిపిస్తున్నాయి.  దీంతో  పదవులు ఆశిస్తున్న నేతలంతా టెన్షన్​ పడుతున్నారు. వ్యవసాయ నేపథ్యం, రిజర్వేషన్​, సీనియారిటీ, పార్టీకి అందించిన సేవలను ప్రామాణికం చేసుకొని జాబితా రూపొందించగా మిగిలిన ఇతర పోస్టులు ఎవరికీ ఇవ్వాలనే కసరత్తు కొనసాగుతుంది. 

ఇందూర్​ కమిటీకి తీవ్ర పోటీ

డిప్యూటీ క్యాబినెట్​ మినిస్టర్​ హోదా ఉన్న నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవి కోసం ఎక్కువ మంది నేతలు పోటీపడుతున్నారు. జిల్లా కాంగ్రెస్​ రైతు విభాగం ప్రెసిడెంట్​ముప్పగంగారెడ్డి, మాజీ చైర్మన్​నగేశ్​రెడ్డి, శేఖర్​గౌడ్, యాదగిరి రేసులో ఉండగా వీరిలో ఒకరిని ఫైనల్​ చేశారు.  

నుడా, జిల్లా గ్రంథాలయ చైర్మన్​ పోస్టులను నరాల రత్నాకర్​, నగర పార్టీ ప్రెసిడెంట్​కేశ వేణు ఆశిస్తుండగా జిల్లా ముఖ్య నేతలు వీరి పట్ల పాజిటివ్‌‌‌‌గా ఉన్నారు.  టీపీసీసీ జనరల్​సెక్రెటరీ గడుగు గంగాధర్ కు​స్టేట్​లెవల్​ పోస్టు ఇవ్వాలని లేదంటే  నుడాతో అడ్జెస్ట్​ కావాలని అనుకుంటున్నట్లు సమాచారం.  జిల్లా వక్ఫ్​బోర్డు కోసం అక్తర్​ పేరును కన్ఫర్మ్​ చేసే ఆలోచన నడుస్తోంది.  

బోధన్​ కంప్లీట్​.. 

బోధన్​వ్యవసాయ​మార్కెట్​ పదవీ మహిళకు రిజర్వు అయినందున మాజీ జడ్పీటీసీ సభ్యురాలు శారద, మాజీ ఎంపీపీ సావిత్రిలో ఒకరికి చాన్స్​ రావొచ్చని భావించారు. అనూహ్యంగా కాంగ్రెస్​ కౌన్సిలర్​ సంధ్య పేరు తెరపైకి వచ్చింది.  అక్కడి చారిత్రక శివాలయం ధర్మకర్తల మండలి చైర్మన్​గా సీనియర్​ నేత హరికాంతచారి, హనుమాన్​టెంపుల్​అధ్యక్ష పోస్టుకు గుండేటి రాములు పేర్లు సర్కారుకు ప్రతిపాదించారు. 

వేల్పూర్​మార్కెట్​ కమిటీ చైర్మన్​రేసులో జలాల్​పూర్​ మోహన్​రెడ్డి, రెంజర్ల ముత్యంరెడ్డి, మెండోరా ముత్యంరెడ్డి ఉండగా వీరిలో ఒకరి పేరును గవర్నమెంట్‌‌‌‌కు ప్రతిపాదించారు. రిజర్వేషన్​ప్రాతిపదికన కమ్మర్​పల్లి కమిటీకి పాలెం నర్సయ్య, గోర్తె రాజేందర్​లో ఒకరికి చాన్స్​ దక్కవచ్చు. ​ ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోటీలో సాయిబాబాగౌడ్, విట్టం జీవన్ ఉండగా సీనియారిటీ ప్రమాణికంగా ఒకరిని సెలెక్ట్ చేశారు.

వర్ని, కోటగిరిలో పోటీ

కేవలం నేతల పదవుల అడ్జెస్ట్​మెంట్​కారణంగా బోధన్​ మార్కెట్​కమిటీ నుంచి విడిపోయి కొత్త కమిటీలు ఏర్పడిన వర్ని, కోటగిరి మార్కెట్​ పోస్టులకు పలువురు పోటీ పడుతున్నారు.  వర్నిలో సురేశ్​బాబా, నేమాని బుజ్జి, యలమంచిలి శ్రీనివాస్​, గంగాప్రసాద్​ మధ్య పోటీ ఉండగా వీరిలో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.  కోటగిరి మార్కెట్​పదవిని హనుమంతు, దేగాం హనుమంతు, పోతంగల్​సాయిబాబా, చిన్న సాయన్న  ఆశిస్తున్నారు.