వనపర్తి, వెలుగు: బాల్యం ఎంతో విలువైనదని, కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. శనివారం వనపర్తి కలెక్టరేట్‌లో మహిళ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జడ్పీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మంచి నడవడిక నేర్పాలని సూచించారు. లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, విద్యపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డీడబ్ల్యూవో పుష్పలత , సీడీపీవో అలివేలమ్మ పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
గద్వాల, వెలుగు: పెండింగ్ కేసుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ సూచించారు. శనివారం జిల్లా కోర్టులో మరో జడ్జి కవితా దేవి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్ రతన్ కుమార్‌తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మాట్లాడారు. 2017 నుంచి 1130 కేసులు ప్రభుత్వం తరఫున పెండింగ్‌లో ఉన్నాయని, స్పెషల్ ఫోకస్ పెట్టి డిస్పోజల్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
టెన్త్ స్టూడెంట్ మిస్సింగ్
నవాబుపేట,వెలుగు: స్కూల్‌కు వెళ్లిన టెన్త్ స్టూడెంట్ అదృశ్యం అయ్యాడు. ఎస్సై పురుషోత్తం వివరాల ప్రకారం.. నవాబుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పెంటల యాదయ్య చిన్న కొడుకు పెంటల ప్రకాశ్(15) స్థానిక హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ నెల 19 న స్కూల్‌కు వెళ్లనని చెప్పడంతో తండ్రి మందలించాడు. దీంతో బుక్స్‌కు తీసుకొని స్కూల్‌కు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తండ్రి గ్రామంలో, బంధువుల ఇండ్లలో వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. శనివారం తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
కొడుకు మాట వింటలేడని కాలువలో దూకిన తల్లి
పెబ్బేరు, వెలుగు : కొడుకు మాట వినడం లేదని ఓ తల్లి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరంగాపూర్ మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య గౌడ్, జయంతి(45) దంపతులకు ఇద్దరు కొడుకులు. కొన్నేళ్ల కింద పెబ్బేరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త వెంకటయ్యగౌడ్ కాలు విరగడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్న కొడుకు వేణు గౌడ్ తాగుడుకు బానిసై, చిన్నచిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఎన్ని సార్లు వద్దని చెప్పినా వినడం లేదు. శుక్రవారం కూడా వేణు మద్యం తాగి రాగా తల్లి మందలించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన జయంతి జూరాల కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం ఉదయం చెలిమిల్ల సమీపంలో డెడ్‌బాడీ దొరికింది. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మైనా ఫ్యామిలీకి ఆర్థిక సాయం
కందనూలు, వెలుగు: జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ మైనా కుటుంబాన్ని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరామర్శించారు. శనివారం తిమ్మాజీపేట మండలం హనుమాన్ తండాకు వెళ్లి ఆమె పేరెంట్స్‌కు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ బ్యాగులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
లెక్చరర్‌ను డిస్మిస్ చేయాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్టూడెంట్ మైనా ఆత్మహత్యకు కారణమైన లెక్చరర్ శ్రీనివాస్ రావును ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్ చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శ్రీనివాసరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ మాట్లాడుతూ మైనాను లైంగికంగా వేధించిన లెక్చరర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు రవి, తేజ, శివ, ఆనంద్, మల్లేశ్ పాల్గొన్నారు.
సీడ్ కంపెనీలతో సైంటిస్టుల కుమ్మక్కు
గద్వాల,వెలుగు: సైంటిస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు సీడ్ కంపెనీలతో కుమ్మక్కై తమను నిండా ముంచుతున్నారని అయిజ మండలం సంకాపురం, ఈడుగోనిపల్లి గ్రామ రైతులు ఆరోపించారు. శనివారం కలెక్టరేట్ ముందు పత్తి మొక్కలు రాలిన కాయలు, పిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు చిన్న కృష్ణ, సోమన్న, గోవింద్, శంకరన్న, శంకరప్ప మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ షాపుల్లో మంచి సీడ్ దొరకడం లేదని, భూత్పూర్ దగ్గర ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్లి సీడ్ తెచ్చామన్నారు. మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాత రాలేదని వాపోయారు. కాని సైంటిస్టులు , అగ్రికల్చర్ ఆఫీసర్లు మాత్రం ప్రతి కూల వాతావరణం, రైతులు ఎక్కువ సార్లు మందులు కొట్టారని చెబుతున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం ఇచ్చారు.
కొడుకు మాట వింటలేడని కాలువలో దూకిన తల్లి
పెబ్బేరు, వెలుగు : కొడుకు మాట వినడం లేదని ఓ తల్లి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరంగాపూర్ మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య గౌడ్, జయంతి(45) దంపతులకు ఇద్దరు కొడుకులు. కొన్నేళ్ల కింద పెబ్బేరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త వెంకటయ్యగౌడ్ కాలు విరగడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. చిన్న కొడుకు వేణు గౌడ్ తాగుడుకు బానిసై, చిన్నచిన్న దొంగతనాలు చేస్తున్నాడు. ఎన్ని సార్లు వద్దని చెప్పినా వినడం లేదు. శుక్రవారం కూడా వేణు మద్యం తాగి రాగా తల్లి మందలించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన జయంతి జూరాల కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా శనివారం ఉదయం చెలిమిల్ల సమీపంలో డెడ్‌బాడీ దొరికింది. కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మైనా ఫ్యామిలీకి ఆర్థిక సాయం
కందనూలు, వెలుగు: జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ మైనా కుటుంబాన్ని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరామర్శించారు. శనివారం తిమ్మాజీపేట మండలం హనుమాన్ తండాకు వెళ్లి ఆమె పేరెంట్స్‌కు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ బ్యాగులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
లెక్చరర్‌ను డిస్మిస్ చేయాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్టూడెంట్ మైనా ఆత్మహత్యకు కారణమైన లెక్చరర్ శ్రీనివాస్ రావును ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్ చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శ్రీనివాసరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ మాట్లాడుతూ మైనాను లైంగికంగా వేధించిన లెక్చరర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు రవి, తేజ, శివ, ఆనంద్, మల్లేశ్ పాల్గొన్నారు.
సత్వర న్యాయానికి చర్యలు
వనపర్తి, వెలుగు : సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు జడ్జిలు నాగార్జున, సాంబశివరావు తెలిపారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ కోర్టు భవనం, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జున మాట్లాడుతూ ఇదివరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రమే కోర్టులు ఉండడంతో క్లయింట్లు ఇబ్బందులు పడేవారని వాపోయారు. దీంతో హైకోర్టు ప్రతి జిల్లాకు కోర్టును మంజూరు చేసిందని, ఉమ్మడి జిల్లాలో 15 కొత్త కోర్టులు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వం కోర్టుల్లో సౌకర్యాల కల్పనకు రూ.200 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. తనకు వనపర్తితో ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడే పుట్టి న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తూ హైకోర్టు జడ్జిగా ఎదిగానని చెప్పారు. ఇక్కడ సౌకర్యాల కల్పనకు మంత్రి నిరంజన్ రెడ్డి తమకు సహకరించారని, జిల్లాలోని కోర్టుకు 200 కంప్యూటర్లు, లైబ్రరీ, ఫర్మిచర్ సమకూర్చారని వివరించారు. వనపర్తిలో అడిషనల్ జిల్లా కోర్టు,న్యాయసేవ సంస్థ, ద్వితీయ శ్రేణి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు (మార్నింగ్ కోర్టు) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు హైకోర్టు జస్టిస్ నాగార్జునను మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు స్థానిక న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు.
ఇబ్బందులు తగ్గాయి: మంత్రి నిరంజన్ రెడ్డి
జిల్లా కోర్టులు ఏర్పడడంతో క్లయింట్లకు ఉమ్మడి జిల్లా కేంద్రానికి వెళ్లే బాధ తప్పిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. కేసుల సంఖ్యను బట్టి సర్కారు అడిషనల్ కోర్టులు కూడా మంజూరు చేస్తుందన్నారు. వనపర్తికి చెందిన నాగార్జున హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించడం, వనపర్తిలో జూనియర్ సివిల్ జడ్జిగా మొదటి పోస్టింగ్ తీసుకున్న సాంబశివరావు హైకోర్టు జస్టిస్ గా పదోన్నతి పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యకరమంలో వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ సీనియర్ న్యాయవాదులు బక్షి చంద్రశేఖర్ రావు, మోహాన్ కుమార్, రామచంద్రారెడ్డి, దినేశ్ రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.
పూత లేని పత్తి.. ధర లేని ఉల్లి
అలంపూర్, వెలుగు: పూత, కాత రావడం లేదని ఓ రైతు పత్తి పంటను దున్నేశాడు. ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన కురువ గోపాల్ తనకున్న ఆరు ఎకరాల్లో పత్తిని సాగు చేశాడు. పంట ఏపుగా పెరిగినా సరిగ్గా పూత పట్టలేదు. అక్కడక్కడ కాయలు కాస్తున్నారాలిపోతున్నాయి. మందులు కొట్టినా ఫలితం లేకపోవడంతో శనివారం ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నేశాడు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులకు రూ. 3 లక్షల దాకా ఖర్చు పెట్టానని, నకిలీ విత్తనాలతోనే పూత పట్టలేదని రైతు ఆరోపించాడు. మరో రైతు వెంకటేశ్వర్లు రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ఉల్లి పంటను సాగు చేశాడు. పంట బాగానే చేతికొచ్చినా మార్కెట్లో ఒక క్వింటాల్ రూ. 300 మాత్రమే పలుకుతోంది. కూలీల డబ్బులు కూడా రాకపోవడంతో శనివారం మిగతా పంటను ట్రాక్టర్ రోటవేటర్‌తో తొలగించాడు. రూ. లక్ష వరకు నష్టపోయానని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు కోరాడు.