వనపర్తి, వెలుగు: ఉపాధ్యాయులు వ్యక్తిత్వ వికాస నిపుణులని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉత్తమ ప్రైవేట్ టీచర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో ఉపాధ్యాయులు చక్కటి నైపుణ్యా న్ని కలిగి ఉంటారన్నారు.
ఉపాధ్యాయ వృత్తి అంతిమ లక్ష్యం విద్యార్థులను జ్ఞాన వంతులుగా తీర్చిదిద్దడమేనన్నారు. ప్రైవేట్ ఉద్యోగులను సన్మానించడం ద్వారా జిల్లాలో కొత్త ఒరవడిని సాహితీ కళా వేదిక ద్వారా సృష్టించిందని అభివర్ణించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ రమేశ్ గౌడ్, సాహితీ వేత్త లు జనజ్వాల, చంద్ర శేఖర్, సత్తార్, నారాయణ రెడ్డి, ప్రతాప రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
సమ్మె విరమించండి
అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెను విరమించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మంత్రిని అంగన్ వాడీలు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి మాట్లాడుతూ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. అంతకు ముందు యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.