నల్గొండ : తెలంగాణ రాష్ట్ర రైతులకు వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రెండు గుడ్ న్యూస్ లు చెప్పారు. నిడమానూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల రైతు భరోసా, రూ.2లక్షల రుణమాఫీ గురించి ప్రస్తావించారు. దీపావళి పండుగ కంటే ముందే మిగిలిన 4లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. త్వరలో రైతు భరోసా కూడా అందిస్తామని అన్నారు. పంటరుణం రూ.2 లక్షల కన్నా పైనున్న వారికి విడతల వారీగా డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
ALSO READ | కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి డిమాండ్
రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు చేపడతామని.. రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర రైతాంగానికి అనుగుణమైన పరిపాలన అందిస్తున్నామని.. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు చిన్నాభిన్నమైయ్యాని మంత్రి తుమ్మల అన్నారు. SLBCతోపాటు, నల్గొండ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసి తీరుతామని తెలిపారు.
కుందురు జానారెడ్డి1982 నుంచి రాజకీయాల్లొ తన చేయి పట్టుకొని నడిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. తన రాజకీయ గురువు జానారెడ్డే అని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోతనను నిలబెట్టింది జానారెడ్డి అని చెప్పుకొచ్చారు.12 శాఖల మంత్రిగా పని చేసిన జానా రెడ్డి ఆయన్ను ప్రోత్సహించారని అన్నారు. జానా రెడ్డి రాజకీయం అంటే నీతి నిజాయితీ నిబద్ధతతో ఉంటాయని మంత్రి తుమ్మల చెప్పారు.