2018 మార్గదర్శకాలే అమలు చేస్తున్నాం : తుమ్మల నాగేశ్వర రావు

  • రుణమాఫీపై  మంత్రి తుమ్మల క్లారిటీ 

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీకి 2018 నాటి మార్గదర్శకాలే తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే  ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంటే హర్షించాల్సిన గత పాలకులు విమర్శలు చేయడాన్ని ఓ ప్రకటనలో తుమ్మల తప్పుప ట్టారు. 

బీఆర్ఎస్ ​ హయాంలో లక్ష రుణ మాఫీ పేరుతో రూ.20 వేల కోట్లు ప్రకటిం చి రూ.13 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, అందులో మళ్లీ రూ.1400 కోట్లు వెనక్కి వచ్చినా స్పందించలేదని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం వద్ద రైతుల వివరాలు ఉన్నాయని, కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమే రేషన్​ కార్డును ప్రామాణి కం చేశామని స్పష్టం చేశారు. మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తించేలా చూస్తామన్నారు.