
- త్వరలో పరిహారం చెల్లింపునకు చర్యలు
- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు కురిసిన చెదురు మదురు వానలు, వడగండ్ల వర్షాలు, ఈదురు గాలులకు 8,408 ఎకరాలలో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు రైతు వారీగా అధికారులు తయారుచేసిన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది.
రైతు వారీ సర్వేకు ప్రభుత్వం ఆదేశించడంతో డిటెయిల్డ్ సర్వేలో అది 8,408 అని తేలింది. ఈ మేరకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు సిద్ధమవుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.