చండ్రుగొండలో ఫర్టిలైజర్ షాపులో తనిఖీ

చండ్రుగొండలో ఫర్టిలైజర్ షాపులో తనిఖీ

చండ్రుగొండ, వెలుగు :  చండ్రుగొండలో పలు ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ జి.బాబూరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యాసంగిలో 63 వేల ఎకరాలలో వరి, 35 ఎకరాలలో మొక్కజొన్న, 1500 ఎకరాలలో వేరుశనగ, 11,500 ఎకరాలలో మిర్చి, 77వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు.

యాసంగిలో సన్నాలకు క్వింటాలు రూ.2320 గిట్టుబాటుధర తో పాటు రూ500 బోనస్ రైతులకు లభిస్తుందన్నారు. ఉగాది నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు లో ఎస్సీ, ఎస్టీ లకు వంద శాతం సబ్సిడీ పై మొక్కలు, డ్రిప్ సరఫరా చేస్తామని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు పై రైతులు దృష్టి సారించాలని కోరారు. ఫర్టిలైజర్ షాపు డీలర్లు పలు రికార్డులతో పాటు షాపు లముందు స్టాకు వివరాల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినయ్ ఉన్నారు.