చండ్రుగొండ, వెలుగు : మిరప తోటల్లో జెమిని వైరస్ (బొబ్బతెగులు) సోకిన మొక్కలు తొలగించాలని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వినయ్ రైతులకు సూచించారు. వెలుగులో ఇటీవల ప్రచురితమైన మిరపను తొలుస్తున్న బొబ్బతెగులు అనే కథనానికి స్పందించి మంగళవారం పలుగ్రామాల్లోని మిరప తోటలను పరిశీలించారు. చండ్రుగొండ, పోకలగూడెం, రావికంపాడు క్లస్టర్ల పరిధిలోని గ్రామాలను పర్యటించారు. తెగులు సోకిన మిరప మొక్కలను పరిశీలించి రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
ALSO READ :- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూకుడు .. ఎన్నికల ముందు హడావుడి శంకుస్థాపనలు
తెగులు సోకని మిరప తోటల్లో డైఫన్ తుర్యాన్ లీటరు నీటిలో ఒక గ్రాము కలిపి స్ప్రే చేయాలన్నారు. పిప్రోనిల్, మిడాక్రోఫిడ్,డయాఫెంధియాన్,పైరిప్రాక్పిఫెన్లను ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి స్ప్రే చేయాలని తెలిపారు. తెల్ల దోమను నివారిస్తే తెగులు సోకడం నిల్చిపోతుందన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వెంట ఏఈవో లు సాయి భాను, శ్రీనివాసరావు, రైతులు ఉన్నారు.