మాడ్గుల మండలంలో పంటలను పరిశీలించిన అగ్రికల్చర్​ ఆఫీసర్లు

మాడ్గుల మండలంలో పంటలను పరిశీలించిన అగ్రికల్చర్​ ఆఫీసర్లు

ఆమనగల్లు, వెలుగు: మాడ్గుల మండలంలో రెండు రోజుల కింద ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, సజ్జ పంటలను సోమవారం వ్యవసాయ అధికారులు పరిశీలించారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఏడీఏ శోభారాణి, మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి, నాగిల్ల, అన్నె బోయిన్ పల్లి, ఇర్విన్ గ్రామాల్లో ఏఈవోలు పంట పొలాలను పరిశీలించి నష్టం వివరాలను అంచనా వేశారు. 

ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ 350 ఎకరాల్లో 165 మంది రైతుల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆమె చెప్పారు. ఏఈవోలు రాజేశ్ నాయక్, ప్రియాంక ఘోష్, నవ్య, వరుణ్  ఉన్నారు