
జైపూర్, వెలుగు: జైపూర్ భీమారం మండలాల్లోని విత్తన దుకాణాల్లో అగ్రికల్చర్, పోలీసు అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ‘మంచిర్యాల మార్కెట్లో నకిలీ వరి విత్తనాలు.. మొద్దునిద్రలో టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు’ హెడ్డింగ్‌తో ‘వెలుగు’లో పబ్లిష్ అయిన వార్తా కథనంపై ఉన్నతాధికారులు స్పందించి తనిఖీలకు ఆదేశించారు. ఈ మేరకు చెన్నూర్ ఏడీఏ బాపు, శ్రీరాంపూర్సీఐ రమేశ్‌బాబుతోపాటు పలువురు పోలీసులు, అగ్రికల్చర్అధికారులు భీమారంతోపాటు మండలంలోని మద్దికల్, ఖాజీపల్లి, కొత్తపల్లిలో తనిఖీలు చేపట్టారు.
జైపూర్మండలంలోని జైపూర్, శెట్ పల్లి, దుబ్బపల్లి, ముదిగుంట, కుందారం, కిష్టాపూర్గ్రామాల్లోని లైసెన్స్డ్ షాపుల్లో తనిఖీలు జరిపారు. నకిలీ విత్తనాలు, ఎక్స్పైర్ అయిన విత్తనాలు దొరకలేదని తెలిపారు. అయితే.. జైపూర్, భీమారం మండలాల్లో నాసిరకం విత్తనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అగ్రికల్చర్ ఆఫీసర్లే ఈ తనిఖీల్లో పాల్గొనడం గమనార్హం.